ఫలములనాశించిన

Phalamulanaashimchina

UncategorizedAdded on 12/13/2018

Lyrics

ఫలములనాశించిన పరలోక తండ్రి
తేరి చూచుచున్నాడు నీ వైపు
ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి
పరీక్షించుచున్నాడు నీ కాపు
ఫలియించకుండుట నీకు న్యాయమా
యజమాని సహనముతో చెలగాటమా
ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు
సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు
చుట్టు త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు
తన స్వాస్థ్యముగా నిను ప్రత్యేకపరచినాడు
(2)         ||ఫలియించకుండుట||
వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేక యుంటే
ఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా
ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే
మోడులాంటి నిన్ను ఇంక నరికివేయకుండునా
(2)         ||ఫలియించకుండుట||

Video