పిల్లలారా

Pillalaaraa

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 6/30/2023

Lyrics

పిల్లలారా నా మాట వినుడి
యెహోవా యందు భక్తి నేర్పెదను –
(2)       ||పిల్లలారా||
బ్రతుక గోరువాడెవడైన కలడా?
మేలునొందుచు చాలా దినములు
(2)       ||పిల్లలారా||
కపటమైన చెడు మాటలాడక
కాచుకొనుము నీదు పెదవులను
(2)       ||పిల్లలారా||
కీడు మాని మేలునే చేయుము
సమాధానము వెదకి వెంటాడు
(2)       ||పిల్లలారా||
యెహోవా దృష్టి నీతిమంతులపై
కలదు వారి మొఱల వినును
(2)       ||పిల్లలారా||
దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి
కొట్టివేయు తన సన్నిధి నుండి
(2)       ||పిల్లలారా||
నీతిమంతులు మొఱ పెట్టగా
విని శ్రమల నుండి తప్పించును
(2)       ||పిల్లలారా||
విరిగినట్టి హృదయములకు
యెహోవా ఆసన్నుడై యున్నాడు
(2)       ||పిల్లలారా||
నలిగియున్న వారల నెల్ల
ఆయనే రక్షించు ప్రేమగల్గి
(2)       ||పిల్లలారా||

Video