పొందితిని నేను
Pomdithini Naenu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 11/5/2013
Lyrics
పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ట ఈవులన్ ఈ భువియందు జీవిత యాత్రలో సాగి వచ్చితిని ఇంత వరకు నాకు తోడై యుండి ఎబినేజరువై యున్న ఓ యేసు ప్రభువా నా రక్షణ కర్తవు నీవైతివి ||పొందితిని|| గాలి తుఫానులలోనుండి వచ్చితిని అంధకార శక్తుల ప్రభావమునుండి నీ రెక్కల చాటున నను దాచితివయ్యా నీవే ఆశ్రయ దుర్గంబైతివి ||పొందితిని|| కష్ట దుఖంబులు నాకు కలుగగా నను చేరదీసి ఓదార్చితివే భయ భీతి నిరాశల యందున ప్రభువా బహుగా ధైర్యంబు నాకొసగితివి ||పొందితిని|| నా దేహమందున ముళ్ళు నుంచితివి సాతానుని దూతగా నలుగ గొట్టన్ వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి ||పొందితిని|| నీ ప్రేమ చేత ధన్యుడనైతిని కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను కష్ట పరీక్షలయందు నా ప్రభువా జయజీవితము నాకు నేర్పించితివి ||పొందితిని||