పూజనీయుడేసు ప్రభు
Poojaneeyudaesu Prabhu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 12/29/2021
Lyrics
పూజనీయుడేసు ప్రభు పలునిందల నొందితివా నాకై (2) ||పూజనీయుడేసు|| నీ స్వకీయులే నిందించినా నిన్నంగీకరించక పోయినా ఎన్నో బాధ లొందితివా నాకై సన్నుతింతును నీ ప్రేమకై ||పూజనీయుడేసు|| సత్యము మార్గము మరి జీవమై నిత్యజీవమియ్యను వచ్చితివి వంచకుడవని నిన్ను నిందించిరా ఓ దయామయా నజరేయుడా ||పూజనీయుడేసు|| యూదా గోత్రపు ఓ సింహమా ఆద్యంతరహిత దైవమా అధములు నిను సమరయుడనిరా నాథుడా నిను బహు దూషించిరా ||పూజనీయుడేసు|| మధురం నీ నామం అతి మధురం మధుర గీతముతో నిన్నారాధింతును వధియించబడితివా యీ పాపికై వందితా ప్రభు నిన్ను పూజింతును ||పూజనీయుడేసు||