పొర్లి పొర్లి పారుతుంది

Porli Porli Paaruthumdi

UncategorizedAdded on 1/21/2021

Lyrics

కల్వరిలో యేసు స్వామి రుధిరమది
నిండియున్న పాపమంత కడిగివేయును
కడిగివేయును.. కడిగివేయును
రండి మునుగుడిందు
పాపశుద్ధి చేయును
చేయును శుద్ధి – చేయును శుద్ధి
(4)     ||పొర్లి||
రక్తము చిందించకుండా పాపము పోదు
పాపము పోదు.. పాపము పోదు
ఆ ముక్తిదాత రక్తమందే
జీవము గలదు
గలదు జీవము – గలదు జీవము
(4)     ||పొర్లి||
విశ్వ పాపములను మోసే యాగ పశువదే
యాగ పశువదే.. యాగ పశువదే
కోసి చీల్చి నదియై పారే
యేసు రక్తము
రక్తము యేసు – రక్తము యేసు
(4)     ||పొర్లి||
చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము
పిల్ల రుధిరము.. పిల్ల రుధిరము
రమ్ము రమ్ము ఉచితము
ఈ ముక్తి మోక్షము
మోక్షము ఉచితము – మోక్షము ఉచితము
(4)     ||పొర్లి||

Video