ప్రాణేశ్వర

Praanaeshvara

UncategorizedAdded on 5/24/2017

Lyrics

ప్రణుతింతును నిన్నే- ఆశతీర
||ప్రాణేశ్వర||
నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె
నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే
(2)   ||ప్రాణేశ్వర||
మూలరాయి నీవైయుండగా – అపొస్తలుల పునాది మీద
నిత్య నివాసముగా కట్టబడుటకై – ఆత్మాభిషేకము అనుగ్రహించితివి
||ప్రాణేశ్వర||
పిడుగులు విసిరే మెరుపుల వంటి – శత్రువులు నాకు ఎదురై నిల్చిన
నాకు విరోధముగా రూపించిన ఏ – ఆయుధము వర్ధిల్లలేదు
||ప్రాణేశ్వర||
నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను
జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము
||ప్రాణేశ్వర||
కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన
కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి
(2)   ||ప్రాణేశ్వర||

Video