ప్రాణమా నా ప్రాణమా

Praanamaa Naa Praanamaa

Lyricistదియ్యా ప్రసాద రావు
UncategorizedAdded on 4/1/2016

Lyrics

ప్రాణమా నా ప్రాణమా
ప్రియ యెహోవాను సన్నుతించుమా
ప్రియ యెహోవా చేసిన మేలులను
నీవు ఎన్నడు మరువకుమా
||ప్రాణమా||
గత కాలములన్నిటిలో
కృపతోనే నడిపించెను
కరుణ కటాక్షమనే
కిరీటం నీకు దయచేసెను
(2) ||ప్రాణమా||
నిను విడువక ఎడబాయక
నిత్యం నీకు తోడైయుండెను
నీవు నడిచిన మార్గములో
నీకు దీపమై నిలచెనుగా
(2) ||ప్రాణమా||
పాప శాపము వ్యాధులను
పారద్రోలియే దీవించెను
పరిశుద్ధుడు పరమ తండ్రి
బలపరిచెను తన కృపతో
(2) ||ప్రాణమా||
మహా ఆనంద మానందమే
మహారాజా నీ సన్నిధిలో
మహిమగల మహారాజా
మనసారా స్తుతించెదను
(2) ||ప్రాణమా||