ప్రభు మొర వినవా

Prabhu Mora Vinavaa

Lyricistజక్కయ్య
UncategorizedAdded on 2/23/2022

Lyrics

ప్రభు మొర వినవా
ప్రభు మొర వినవా
నీ కొరకే నేను వెదకేను దేవా
నాకొకసారి కనిపించ రావా –
(2)     ||ప్రభు||
నాదు ప్రాణము తల్లడిల్లాగా
భూదిగంతముల నుండియేగా
మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా
(2)      ||నీ కొరకే||
ఎక్కలేని ఎత్తైన కొండ
ఎక్కించుము నను పరిశుద్ధ కొండ
చక్కని ప్రభు నీ మోము జూడ
(2)      ||నీ కొరకే||
మిత్రుడా నా ఆశ్రయ నీవే
శత్రువుల యెడ నా కోట నీవే
స్తుతికి కారణభూతుడా నీవే
(2)      ||నీ కొరకే||

Video