ప్రభు యేసు నా రక్షకా

Prabhu Yaesu Naa Rakshakaa

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 10/5/2015

Lyrics

ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ
అల్ఫయు నీవే – ఒమేగయు నీవే
||ప్రభు యేసు||
ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసు నీ స్వరూపము
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము
||ప్రభు యేసు||
లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడ నేనైతిని
చక్కజేసి నా నేత్రాలు దెరచి
గ్రక్కున నిన్ను జూడనిమ్ము
||ప్రభు యేసు||
ఎరిగి యెరిగి నే చెడిపోతిని
యేసు నీ గాయము రేపితిని
మోసపోతి నేను దృష్టి దొలగితి
దాసుడ నన్ను జూడనిమ్ము
||ప్రభు యేసు||
ఎందరేసుని వైపు చూచెదరో
పొందెదరు వెల్గు ముఖమున
సందియంబు లేక సంతోషించుచు
ముందుకు పరుగెత్తెదరు
||ప్రభు యేసు||
విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
కొనసాగించువాడా యేసు ప్రభూ
వినయముతో నేను నీ వైపు జూచుచు
విసుగక పరుగెత్త నేర్పు
||ప్రభు యేసు||
కంటికి కనబడని వెన్నియో
చెవికి వినబడని వెన్నియో
హృదయ గోచరము కాని వెన్నియో
సిద్ధపరచితివ నాకై
||ప్రభు యేసు||
లోక భోగాలపై నా నేత్రాలు
సోకకుండునట్లు కృప జూపుము
నీ మహిమ దివ్య స్వరూపమును
నిండార నను జూడనిమ్ము
||ప్రభు యేసు||

Video