ప్రభు యేసుని వదనములో

Prabhu Yaesuni Vadanamulo

UncategorizedAdded on 10/1/2015

Lyrics

ఏ బి మాసిలామణి
ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె
పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో
పరలోకముకై – చిర జీవముకై
ప్రార్ధించెను నా హృదయం
||ప్రభు యేసుని||
దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో
దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును
ధన పీడనతో – మృగ వాంఛలతో
దిగాజారితి చావునకు
||ప్రభు యేసుని||
యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు
ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని
ఇల వేడితిని – విలపించుచును
ఈడేరెను నా వినతి
||ప్రభు యేసుని||
పరదైసున ఈ దినమే – నా ఆనందములోను
పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే
పరలోకమే నా – తుది ఊపిరిగా
పయనించితి ప్రభు కడకు
||ప్రభు యేసుని||

Video