ప్రభుని గృహము
Prabhuni Gruhamu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 5/31/2020
Lyrics
ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను అపరాధములచే ప్రజలందరును దేవుని మహిమను కోల్పోయిరి తన మహిమను మన కిచ్చుటకు యేసు ప్రభువే బలి యాయెన్ (2) ||ప్రభుని|| కృపా సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను తండ్రి మహిమను తన సుతునిలో మనమందరము చూచితిమి (2) ||ప్రభుని|| ప్రభువు యింటిని నిర్మించు చుండె సజీవమైన రాళ్ళతో ఆయన మహిమ దానియందుండ తన సంకల్పమై యున్నది (2) ||ప్రభుని|| శాంతిరాజు యిల్లు కట్టుచున్నాడు మానవ హస్తము అందుండదు క్రయమునిచ్చి స్థలముకొనెను తాను కోరిన స్థలమదే (2) ||ప్రభుని|| ప్రత్యేకపరచిన ఆత్మీయ యింటికి తన పునాదిని వేసెను రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా ప్రభువే సర్వము చేసెను (2) ||ప్రభుని|| సింహాసనముపై కూర్చున్న ప్రభువే అణగ ద్రొక్కెను శత్రువును సంపూర్ణ జయముతో ఆర్భాటముతో వెలిగించెను తన యింటిని (2) ||ప్రభుని|| దేవుని యిల్లు ముగించబడగా పైనుండి అగ్ని దిగివచ్చున్ దహించబడును సర్వ మలినము ఇంటిని మహిమతో నింపును (2) ||ప్రభుని||