ప్రభుని రాకడ
Prabhuni Raakada
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 8/28/2020
Lyrics
ప్రభుని రాకడ – ఈ దినమే పరుగులిడి రండి – సుదినమే పరమునందుండి – మన ప్రభువు ధరకు నరుగును – పాలనకై బూరశబ్దముతో – జనులారా ||ప్రభుని|| సిద్ధులగు వారిన్ – మన యేసు శుద్ధి జేయునిలన్ – పరమునకై బుద్ధిహీనులను – శ్రమలచేత బద్ధులుగ జేయున్ – వేదనతో బాధ కలిగించున్ – సాతాను ||ప్రభుని|| స్వరముతో వచ్చున్ – అధికారి మహిమతో మరలున్ – తన దూత సూర్యచంద్రునిలన్ – తారలతో జీకటుల్ క్రమ్మున్ – ప్రభు రాక పగలు రాత్రియగున్ – త్వరపడుము ||ప్రభుని|| మొదట లేతురు – సజీవులై ప్రభునియందుండు – ఆ మృతులు మరల అందరము – ఆ ధ్వనితో పరము జేరుదుము – ధరనుండి ధన్యులగుదుము – పరికించు ||ప్రభుని|| వెయ్యియేండ్లు – పాలించెదరు ప్రియుని రాజ్యమున – ప్రియులు సాయం సమయమున – చేరి నెమలి కోకిలలు – రాజున్ పాడి స్తుతించును – ఆ దినము ||ప్రభుని|| గొర్రె మేకలును – ఆ చిరుత సింహజాతులును – ఒక చోట భేధము లేక – బరుండి గరిక మేయును – ఆ వేళ కలసి మెలగును – భయపడక ||ప్రభుని|| న్యాయ నీతులన్ – మన ప్రభువు ఖాయముగ దెల్పున్ – ఆనాడు సాక్షులుగ నిలుతుం – అందరము స్వామియేసునకు – ధ్వజమెత్తి చాటి యేసునకు – ఓ ప్రియుడా ||ప్రభుని||