ప్రభువా కాచితివి

Prabhuvaa Kaachithivi

Lyricistక్రీస్తు దాస్
UncategorizedAdded on 9/28/2016

Lyrics

ప్రభువా… కాచితివి ఇంత కాలం
కాచితివి ఇంత కాలం
చావైన బ్రతుకైన నీ కొరకే దేవా
నీ సాక్షిగా నే జీవింతునయ్యా
||ప్రభువా||
కోరి వలచావు నా బ్రతుకు మలిచావయ్యా
మరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా
నన్ను వలచావులే – మరి పిలిచావులే
అరచేతులలో నను చెక్కు కున్నావులే
(2)       ||ప్రభువా||
నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా
ఇలలో మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా
పాపము కడిగావులే – విషము విరచావులే
నను మనిషిగా ఇలలోన నిలిపావులే
(2)       ||ప్రభువా||
బాధలను బాపితివి నీవేనయ్యా
నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా
నన్ను దీవించితివి – నన్ను పోషించితివి
నీ కౌగిలిలో నను చేర్చుకున్నావులే
(2)       ||ప్రభువా||

Video