ప్రభువా నే నిన్ను నమ్మి
Prabhuvaa Nae Ninnu Nammi
Lyricistఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
UncategorizedAdded on 5/10/2017
Lyrics
ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు (2) ||ప్రభువా|| గర్విష్టులైన వారు నాతో పోరాడుచుండ ప్రతి మాటకెల్ల వారు పర భావమెంచుచుండ ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు (2) ||ప్రభువా|| నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా (2) ||ప్రభువా||