ప్రభువా నీలో జీవించుట

Prabhuvaa Neelo Jeevimchuta

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 6/13/2018

Lyrics

ప్రభువా నీలో జీవించుట
కృపా బాహుల్యమే
నా యెడ కృపా బాహుల్యమే
||ప్రభువా||
సంగీతములాయె
పెను తుఫానులన్నియు
సమసిపోవునే నీ నామ స్మరణలో
సంతసమొందె నా మది యెంతో
(2)       ||ప్రభువా||
పాప నియమమును
బహు దూరముగా చేసి
పావన ఆత్మతో పరిపూర్ణమైన
పాద పద్మము హత్తుకొనెదను
(2)       ||ప్రభువా||
నీలో దాగినది
కృప సర్వోన్నతముగా
నీలో నిలిచి కృపలనుభవించి
నీతోనే యుగయుగములు నిల్చెద
(2)       ||ప్రభువా||
నూతన వధువునై
శుద్ధ వస్త్రములు ధరించి
నూతనమైన శుభాకాంక్షలతో
నూతన షాలేమై సిద్దమౌదు నీకై
(2)       ||ప్రభువా||

Video