ప్రభువా నిను కీర్తించుటకు
Prabhuvaa Ninu Keerthimchutaku
Lyricistపి సతీష్ కుమార్
UncategorizedAdded on 8/3/2017
Lyrics
ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి అర్పించినను నీ ఋణము నే తీర్చగలనా తగిన కానుక నీకు అర్పింపగలనా ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్లు చాలునా దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా ఎంతగ నిను కీర్తించినను – యేమేమి అర్పించినను నీ ఋణము నే తీర్చగలనా తగిన కానుక నీకు అర్పించగలనా (2) ||ప్రభువా|| కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి నా గుడారమునే విశాల పరచి ఇంతగ నను హెచ్చించుటకు నే తగుదునా… నే తగుదునా… వింతగ నను దీవించుటకు నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా|| నీ నోటి మాట నా ఊటగ నుంచి నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి ఇంతగ నను వాడుకొనుటకు నే తగుదునా… నే తగుదునా… వింతగ నను హెచ్చించుటకు నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా||