ప్రభువా ప్రభువా

Prabhuvaa Prabhuvaa

Lyricistప్రభువా ప్రభువా
UncategorizedAdded on 2/14/2018

Lyrics

కడలిని మా గాథ వినవా
ప్రభువా ప్రభువా
ఇకనైనా మా జాలి గనవా
ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు
ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధనల్
||ప్రభువా||
ఎదలో చెలరేగే సుడిగాలుల్లో
ఎగసే ఆశ నిరాశ కెరటాలు
నావకు చుక్కానివై
నాలో ధైర్యం కలిగించవా
సహనము శాంతము కరువు అయిన బ్రతుకులో
మరియ తనయా మరి ఇంకా ఎన్నాళ్లీ శోధనల్
||ప్రభువా||
దేవా నీ దయలో ధన్యుడనవ తగనా
నాలో విశ్వాసం ఇంకా చాలాదనా
మందలో నీ అండలో
నేను ఉన్నా గొర్రెపిల్లనై
దీనులు అనాథలు అభాగ్యులైన ఎందరినో
నడిపించు ఓ తండ్రి నాకింక ఎన్నాళ్లీ శోధనల్
||ప్రభువా||

Video