ప్రేమా పూర్ణుడు
Praemaa Poornudu
Lyricistజాన్ డేనియల్
UncategorizedAdded on 2/11/2018
Lyrics
ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు నను ప్రేమించి ప్రాణమిచ్చెను నే పాడెదన్ – కొనియాడెదన్ నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4) ||ప్రేమా|| లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ యేసుని ప్రేమ వెల యెంతో ఇహమందైనా పరమందైనా వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2) ||ప్రేమా|| మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ రక్తము కార్చి రక్షణ నిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2) ||ప్రేమా||