ప్రేమగల మా ప్రభువా
Praemagala Maa Prabhuvaa
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 7/31/2016
Lyrics
ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా (2) ||ప్రేమగల|| నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె నిక్కముగ రుజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే (2) ||ప్రేమగల|| అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను (2) ||ప్రేమగల|| బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను (2) ||ప్రేమగల|| తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు తండ్రి ప్రేమ మారదు – మార్పుచెందని ప్రేమయే (2) ||ప్రేమగల|| మరణమంత బలముగలది నీదు ప్రేమ ప్రభువా వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను (2) ||ప్రేమగల||