ప్రేమగల యేసయ్యా

Praemagala Yaesayyaa

Lyricistప్రేమగల యేసయ్యా
UncategorizedAdded on 5/2/2017

Lyrics

జీవ వృక్షమా యేసయ్యా
సిలువలో బలి అయిన యేసయ్యా
తులువలో వెలి అయిన యేసయ్యా
పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా
పరిశుద్ధుడా నా ప్రాణేశ్వరా
పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా
పరిశుద్ధుడా నా ప్రాణ ప్రియుడా
||ప్రేమగల||
యేసయ్య నీ శిరముపై మూళ్ళ కిరీటం మొత్తగా
రక్తమంత నీ కణతలపై ధారలుగా కారుచుండగా
కొరడాల దెబ్బలు చెళ్లుమనెను
శరీరపు కండలే వేలాడేను
నలిగిపోతివా నా యేసయ్యా
(2)        ||పరిశుద్ధుడా||
యేసయ్యను కొట్టిరి జాలిలేని ఆ మనుష్యులు
ముఖానపై ఉమ్మి వేసిరి కరుణ లేని కక్షకులు
గడ్డము పట్టాయనను లాగుచుండగా
నాగటి వలె సిలువలో దున్నబడగా
ఒరిగిపోతివా నా యేసయ్యా
(2)        ||పరిశుద్ధుడా||
యేసయ్య ఆ కల్వరిలో దాహముకై తపియించగా
మధురమైన ఆ నోటికి చేదు చిరకను ఇచ్చిరే
తనువంత రుధిరముతో తడిసిపోయెనే
తండ్రీ అని కేక వేసి మరణించెనే
మూడవ దినాన తిరిగి లేచెను
(2)        ||పరిశుద్ధుడా||

Video