ప్రేమతో యేసు

Praematho Yaesu

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 11/10/2024

Lyrics

ప్రేమతో యేసు – పిలచుచున్నాడు రమ్ము
రక్షణను పొంది – లక్షణముగా వెళ్ళుము
(2)      ||ప్రేమతో||
పాపమెరుగని ప్రభు నీ కొరకు
పాపముగను చేయబడెను
శాపగ్రాహియాయె సిలువలో
శాపగ్రాహియాయె సిలువలో పరుగిడి రమ్ము
(2)      ||ప్రేమతో||
ముండ్ల కిరీటమును ధరించి
ముఖముపై నుమ్మి వేయబడె
ప్రాణమిడె నేసు సిలువలో
ప్రాణమిడె నేసు సిలువలో పరుగిడి రమ్ము
(2)      ||ప్రేమతో||
సిలువలో నీకై దప్పిగొని
కలుష నీ క్షమకై ప్రార్థించి
సహించి ప్రాణమిడె నీ కొరకు
సహించి ప్రాణమిడె నీ కొరకు పరుగిడి రమ్ము
(2)      ||ప్రేమతో||
తప్పిన గొర్రెను రక్షింప
తనదు రక్తమును చిందించె
కాపరి స్వరము ధ్వనించె
కాపరి స్వరము ధ్వనించె పరుగిడి రమ్ము
(2)      ||ప్రేమతో||
తామసించ తగదిక ప్రియుడా
త్వరపడుము నీ రక్షణ కొరకు
నేడే నీ రక్షణ దినము
నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము
(2)      ||ప్రేమతో||
తానే కడుగును తన రక్తముతో
తండ్రివలె నీ పాపమునంత
తనయుడవై పోదు విపుడే
తనయుడవై పోదు విపుడే పరుగిడి రమ్ము
(2)      ||ప్రేమతో||
ప్రేమవార్త ప్రకటింపబడె
ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము
కృపాకాలమిదే జాగేల
కృపాకాలమిదే జాగేల పరుగిడి రమ్ము
(2)      ||ప్రేమతో||

Video