ప్రేమింతును నిన్నే

Praemimthunu Ninnae

UncategorizedAdded on 2/1/2017

Lyrics

ధ్యానింతును నిన్నే – ప్రకటింతును నీకై
యేసూ… నీవే…
అతి సుందరుడా – అతి శ్రేష్టుడా
నీవే… అతి కాంక్షనీయుడా
నా ప్రాణ ప్రియుడా – నా యేసయ్యా
||ప్రేమింతును||
నీతోనే నేనెల్లప్పుడు జీవింతును యేసయ్యా
ప్రతి దినము నీ రాకడకై నేనెదురు చూచెదనయ్యా
నీ రెక్కల నీడలో నన్ను కాపాడావు
నా జీవిత కాలమంతా నిన్నే కీర్తింతునయ్యా
నీ ముఖము అతి మనోహరం సూర్య కాంతి మించినది
నీ స్వరము అతి మధురం తేనె కంటె తీయనిది
షాలేము రాజా సమాధాన కర్తా
రక్షణ పాత్ర చేత బూని ఆరాధింతునయ్యా

Video