ప్రతి రోజు చూడాలని

Prathi Roju Choodaalani

UncategorizedAdded on 1/2/2019

Lyrics

పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను
తనివి తీర చూసినా నా యేసయ్య రూపం
నా హృదయమే పొంగి పొర్లును
నా మనసే సంతోషించును
(2)        ||ప్రతి||
పరలోకమందున పరిశుద్ధ దూతలతో
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతియించబడుచుండెను
జీవ జలము యొద్దకు నడిపించును
ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును
నా హృదయమే పొంగి పొర్లును
నా మనసే సంతోషించును
(2)        ||ప్రతి||
ఆకాశమందున రారాజుగా వచ్చును
భూజనులందరు రొమ్ము కొట్టుకొనుచుందురు
కడబూరధ్వని వినిపించును
పరలోక సైన్యముతో వచ్చును
నా హృదయమే పొంగి పొర్లును
నా మనసే సంతోషించును
(2)        ||ప్రతి||

Video