ప్రతిగా (యేసు యేసూ)

Prathigaa Yaesu Yaesoo

UncategorizedAdded on 6/15/2021

Lyrics

యేసు యేసూ.. యేసూ.. యేసు
యేసు యేసూ.. యేసూ.. యేసు
నా ప్రియమైన యేసు నన్ను ప్రేమించినావు
నన్ను వెదకి రక్షించుటకై పరము వీడినావు
ప్రాణమైన నా యేసు నన్ను హత్తుకున్నావు
శాశ్వతా జీవమిచ్చి శ్వాస విడచినావు
||యేసు యేసూ||
నా నీతికి ప్రతిగా నీవు పాపమయ్యావు
ఆశీర్వాదముగ నను చేయ – నీవు శాపమయ్యావు
నా స్వస్థతకు ప్రతిగా వ్యాధిననుభవించావు
నాకు నీ రూపమిచ్చి నలుగగొట్టబడ్డావు
||యేసు యేసూ||
ప్రాణానికి ప్రతిగా ప్రాణమే విడచినావు
అధిక విజయము నాకీయ మరణమే గెలచినావు
పరమ పురములో నివసింప వారసత్వమిచ్చావు
నిన్ను నిత్యము ఆరాధింప – నన్ను ఎన్నుకున్నావు
||యేసు యేసూ||

Video