ప్రీతిగల మన యేసు
Preethigala Mana Yaesu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 2/14/2016
Lyrics
ప్రీతిగల మన యేసు – డెంతో గొప్ప మిత్రుడు మితిలేని దయచేత – హత్తుచు ప్రేమించును క్రీస్తునొద్ద మన భార – మంత నప్పగించినన్ శక్తిగల యేసు చేత – మోత లెల్ల వీడును నీతిగల మన యేసు – ధృతిగల మిత్రుడు మృతి బొంది కృపతో వి – శ్రాంతి కలిగించెను భీతి నొందు బాపులైన – జింతా క్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత – క్రొత్త గతి జూతురు దయగల మన యేసు – ప్రియమైన మిత్రుడు మాయలోకమందు నిజా – శ్రయుడై కాపాడును భయ దుఃఖ శ్రమ లాది – మోయరాని బాధలన్ జయ మొప్ప నేర్పి యేసు – స్థాయి వృద్ది చేయును ధారుణిలో యేసుగాక – వేరు గొప్ప మిత్రుడా? పరలోకమందు యేసే – వీరుడౌ రక్షకుడు నారకుల! గావ వేగా – గ్రూర హింస బొందెను కరుణించి నిచ్చి ప్రతి – ప్రార్థన నాలించును