ప్రియ యేసు మన కొరకు

Priya Yaesu Mana Koraku

UncategorizedAdded on 3/26/2018

Lyrics

ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం
(2)    ||ప్రియ యేసు||
కల్వరి కొండపైన
దొంగాల మధ్యలోన
సిల్వలోన వ్రేలాడెను
నాకై యేసు మరణించెను
(2)    ||ప్రియ యేసు||
ముండ్లతో అల్లిన మకుటం
జల్లాటమున పెట్టగా
స్రవించె పరిశుద్ధ రక్తం
ద్రవించె నా హృదయం
(2)    ||ప్రియ యేసు||
పాపాంధకారములో
పయనించు మనుజులను
పావనులుగా చేయుటకు
పావనుడేసు మరణించెను
(2)    ||ప్రియ యేసు||
పాపినైన నా కొరకు
ప్రేమించి ప్రాణమిచ్చెను
సిల్వలో వ్రేళాడెను
నీకై ప్రాణమునిచ్చెను
(2)    ||ప్రియ యేసు||

Video