ప్రియ యేసు రాజును
Priya Yaesu Raajunu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 11/5/2013
Lyrics
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ||ప్రియ యేసు|| యేసుని రక్తమందు కడుగబడి వాక్యంచే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను బంగారు వీదులలో తిరిగెదను ||ప్రియ యేసు|| ముండ్ల మకుటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ ||ప్రియ యేసు|| హృదయము స్తుతులతో నింపబడెను నా భాగ్య గృహమును స్మరించుచు హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ వర్ణింప నా నాలుక చాలదయ్యా ||ప్రియ యేసు|| ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో ఆశతో వేచియుండే నా హృదయం ||ప్రియ యేసు||