ప్రియమైన యేసయ్యా

Priyamaina Yaesayyaa

Lyricistడేవిడ్ విజయరాజు
UncategorizedAdded on 8/17/2016

Lyrics

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ
(2)        ||ప్రియమైన||
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా
(2)       ||నా ప్రియుడా||
ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే
(2)       ||నా ప్రియుడా||
ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం
(2)       ||నా ప్రియుడా||

Video