ప్రియతమ బంధమా

Priyathama Bmdhamaa

Lyricistరాజ్ ప్రకాష్ పాల్
UncategorizedAdded on 12/30/2017

Lyrics

ప్రియతమ బంధమా – నా హృదయపు ఆశ్రయ దుర్గమా
అనుదినం అనుక్షణం – నీ ఒడిలో జీవితం ధన్యము
కృతజ్ఞతతో పాడెదను
నిరంతరము స్తుతించెదను
||ప్రియతమ||
అంధకారపు సమయములోన – నీతి సూర్యుడై ఉదయించావు
గమ్యమెరుగని పయనములోన – సత్య సంధుడై నడిపించావు
నా నిరీక్షణ ఆధారం నీవు
నమ్మదగిన దేవుడవు నీవు
కరుణ చూపి రక్షించినావు
కరుణామూర్తి యేసు నాథా
వందనం వందనం దేవా – వందనం వందనం
అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం
||కృతజ్ఞతతో||
పరమ తండ్రివి నీవేనని – పూర్ణ మనసుతో ప్రణుతించెదను
పరిశుద్ధుడవు నీవేనని – ప్రాణాత్మలతో ప్రణమిల్లెదను
విశ్వసించిన వారందరికి
నిత్య జీవము నొసగె దేవా
కరుణ చూపి రక్షించినావు
కరుణామూర్తి యేసు నాథా
వందనం వందనం దేవా – వందనం వందనం
అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం
||కృతజ్ఞతతో||

Video