పుట్టినాడంట యేసునాథుడు

Puttinaadmta Yaesunaathhudu

Lyricistసాయారం గట్టు
UncategorizedAdded on 12/16/2018

Lyrics

తూరుపు దిక్కున చుక్క బుట్టె
దూతలు పాటలు పాడ వచ్చె
చలి మంట లేకుండా ఎలుగే పుట్టె
చల్లని రాతిరి కబురే తెచ్చె
పుట్టినాడంట యేసునాథుడు
పాపములు తీసే పరమాత్ముడు
(2)        ||తూరుపు||
గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి
కొలిచినారు తనకు కానుకలిచ్చి
పశుల పాక మనము చేరుదాము
కాపరిని కలిసి వేడుదాము
(2)        ||పుట్టినాడంట||
చిన్నా పెద్దా తనకు తేడా లేదు
పేదా ధనికా ఎప్పుడూ చూడబోడు
తానొక్కడే అందరికీ రక్షకుడు
మొదలు నుండి ఎప్పుడూ ఉన్నవాడు
(2)        ||పుట్టినాడంట||
మంచి చెడ్డా ఎన్నడు ఎంచబోడు
చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు
నమ్మి నీవు యేసును అడిగి చూడు
తన ప్రేమను నీకు అందిస్తాడు
(2)        ||పుట్టినాడంట||

Video