పువ్వు విరిసి రాలినా
Puvvu Virisi Raalinaa
UncategorizedAdded on 1/9/2021
Lyrics
పువ్వు విరిసి రాలినా పరిమళంబు మిగులును జీవ నీవే తెలుసుకో నీ జీవితం ఏపాటిదో ||పువ్వు|| ధరలో కలిమి లేములు దరి చేరగానే కరగిపోవును దూరపర్చుమా లౌకికం చేరు యేసును శీఘ్రమే ||పువ్వు|| పుడమిలో ఫలియించుమా ఫలమిచ్చు ద్రాక్షా వల్లిలా నేల రాలిన పువ్వులా తేలిపోకుమా గాలిలోన ||పువ్వు|| భువిలో బ్రతుకుట కన్నను భగవంత సన్నిధి పెన్నిధి భారమనక పిలువవే కోరుకో నువ్వు క్రైస్తవా ||పువ్వు||