రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
Raajaa Nee Sannidhilonae Umtaanayyaa
Lyricistజాన్ జె
UncategorizedAdded on 6/14/2022
Lyrics
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో (2) ||నేనుండలేనయ్యా|| ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా ||నేనుండలేనయ్యా|| ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా ||నేనుండలేనయ్యా||