రాజులకు రాజైన ఈ
Raajulaku Raajaina Ee
UncategorizedAdded on 10/26/2017
Lyrics
పూజ చేయుటకు రండి ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని ||రాజులకు|| కరుణ గల సోదరుండై ఈయన ధరణికేతెంచెనయ్యా స్థిరముగా నమ్ముకొనిన మనకొసగు పరలోక రాజ్యమును ||రాజులకు|| నక్కలకు బొరియలుండే నాకాశ పక్షులకు గూళ్లుండెను ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను ||రాజులకు|| త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరలు దరికి జేరిన వారిని ఈ ప్రభువు తరుమడెన్నడు దూరము ||రాజులకు||