రాకడ సమయంలో

Raakada Samaymlo

UncategorizedAdded on 1/20/2016

Lyrics

యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా?
రావయ్య యేసయ్య – వేగరావయ్యా
రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా
యేసయ్య రాకడ సమయంలో
ఎదురేగె రక్షణ నీకుందా?
లోకాశలపై విజయం నీకుందా?
(2)       ||రావయ్య||
ఇంపైన ధూపవేదికగా
ఏకాంత ప్రార్థన నీకుందా?
యేసు ఆశించే దీన మనస్సుందా?
(2)       ||రావయ్య||
దినమంతా దేవుని సన్నధిలో
వాక్యం కొరకు ఆకలి నీకుందా?
యేసునాథునితో సహవాసం నీకుందా?
(2)       ||రావయ్య||
శ్రమలోన సహనం నీకుందా?
స్తుతియించే నాలుక నీకుందా?
ఆత్మలకొరకైన భారం నీకుందా?
(2)       ||రావయ్య||
నీ పాత రోత జీవితము
నీ పాప హృదయం మారిందా?
నూతన హృదయంతో ఆరాధన నీకుందా?
(2)       ||రావయ్య||
అన్నీటికన్నా మిన్నగను
కన్నీటి ప్రార్థన నీకుందా?
ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా?
(2)       ||రావయ్య||

Video