రాకడనే రైలు బండి
Raakadanae Railu Bmdi
Lyricistపీటర్ సింగ్
UncategorizedAdded on 10/5/2016
Lyrics
రాకడనే రైలు బండి వస్తున్నది రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది పరిశుద్ధులకందులో చోటున్నది మంచి చోటున్నది – భలే చోటున్నది చక్కని సీటున్నది ||రాకడనే|| సత్యమనే చక్రములు దానికున్నవి శాంతి అనెడి పైకప్పు దానికున్నది (2) పాపములను క్షమియించే బ్రేకులున్నవి – బండికి బ్రేకులున్నవి జీవమునకు మార్గమని కూయుచున్నది – కూత కూయుచున్నది ||రాకడనే|| ప్రతి దినము బైబిలును పఠియించుము ప్రార్దననెడి విజ్ఞాపన వివరించుము – ప్రభుకి వివరించుము ఎదురు వీచే గాలులనెడి వ్యాధి బాధలన్ సాతాను చిక్కులను యేసు రక్తమందు కడిగి జయము పొందుము – పవిత్రుడవు కమ్ము ||రాకడనే|| తండ్రి కుమారాత్మలనే రైలు బండిది ఇంజను డ్రైవరు పేరు యెహోవాండి పరిశుద్ధ ఆత్మ అనెడి గార్డు ఉన్నాడు – బండికి గార్డు ఉన్నాడు సిలువ జెండా ఎత్తి చూపి బండి నిలుపుము – నీవు ప్రవేశించుము ||రాకడనే|| రక్షణనే టిక్కెట్టు దానికున్నది మారు మారుమనస్సు పొంది మీరు ముందుకు రండి – టిక్కెట్టు కొనండి ||రాకడనే|| పాపులున్న స్టేషనులో బండి ఆగదు పరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును – రైలు బండి ఆగును ||రాకడనే||