రారాజు జన్మించే ఇలలోన

Raaraaju Janmimchae Ilalona

UncategorizedAdded on 5/15/2017

Lyrics

రారాజు జన్మించే ఇలలోన
యేసు రారాజు జన్మించే ఇలలోన
ఈ శుభ సంగతిని – ఊరూ వాడంతా
రండీ మనమంతా చాటి చెప్పుదాం
ఓ సోదరా… ఓ సోదరీ…
విష్ యు హాప్పీ క్రిస్మస్
అండ్ వెల్కమ్ యు టు క్రిస్మస్
(2)       ||రారాజు||
అదిగదిగో తూర్పున ఆ చుక్కేమిటి సోదరా
గ్రంథాలను విప్పి దాని అర్దమేంటో చూడరా
రాజులకు రారాజు పుడతాడంటూ
లేఖనాలు చెప్పినట్టు జరిగిందంటూ
రాజాధి రాజుని చూడాలంటూ
(తూర్పు) జ్ఞానులంత ప్రభు యేసుని చూడవచ్చిరి –
(2)        ||ఓ సోదరా||
అదిగదిగో తెల్లని ఆ వెలుగేమిటి సోదరా
(అని) గొల్లలంత భయపడుతూ వణికిపోతు ఉండగా
రక్షకుడు మీకొరకు పుట్టాడంటూ
గొల్లలతో దేవదూత మాట్లాడేనూ
ఈ లోక రక్షకుని చూడాలంటూ
(ఆ) గొల్లలంత ప్రభు యేసుని చూడవచ్చిరి –
(2)        ||ఓ సోదరా||

Video