రారాజు పుట్టాడోయ్
Raaraaju Puttaadoy
UncategorizedAdded on 12/11/2020
Lyrics
సూడంగ రారండోయ్ వేడంగ రారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిగ పుట్టినాడండోయ్ మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే… ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయెనే, హోయ్… ||రారాజు|| వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు కన్నుల విందుగా దూతలు పాడగా సందడే సిందేయంగ మిన్నుల పండగ సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట పశువుల పాకలోన ఆ పసి బాలుడంట చెరగని స్నేహమై….. ||రారాజు|| మచ్చలేని ముత్యమల్లె పొడిసే సూరీడు మనసులో దీపమై దారి సూపు దేవుడు ప్రేమ పొంగు సంద్రమల్లె కంటికి రెప్పలా అందరి తోడునీడై మాయని మమతలా సల్లంగా సూడ యేసు ఇల వచ్చినాడంట వరముగ చేర యేసు పరమును వీడెనంట మరువని బంధమై….. ||రారాజు||