రారాజు వస్తున్నాడో

Raaraaju Vasthunnaado

Lyricistరారాజు వస్తున్నాడో
UncategorizedAdded on 1/8/2018

Lyrics

జనులారా.. రాజ్యం తెస్తున్నాడో
త్వరపడి వేగమే రండి
ప్రియులారా.. ప్రభుని చేరగ రండి
వస్తానన్న యేసు రాజు రాక మానునా
తెస్తానన్న బహుమానం తేక మానునా
(2)       ||రారాజు||
పాపానికి జీతం రెండవ మరణం
అది అగ్ని గుండము అందులో వేదన
మహిమకు యేసే మార్గము జీవము
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము
(2)       ||వస్తానన్న||
పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేను
ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు
యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం
యేసయ్య గాయాలు రక్షణకు మార్గం
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము
(2)       ||వస్తానన్న||
కనురెప్ప పాటున కడబూర మ్రోగగా
పరమున ఉందురు నమ్మిన వారందరు
నమ్మని వారందరు శ్రమల పాలవుతారు
అందుకే నమ్ముకో యేసయ్యను
చేరుకో పరలోక రాజ్యంబును
(2)       ||వస్తానన్న||

Video