రారే చూతము

Raarae Choothamu

UncategorizedAdded on 11/19/2019

Lyrics

రారే చూతము రాజసుతుని
రేయి జనన మాయెను
రాజులకు రారాజు మెస్సయ్యా
రాజితంబగు తేజమదిగో
(2)    ||రారే||
దూత గణములన్ దేరి చూడరే
దైవ వాక్కులన్ దెల్పగా
దేవుడే మన దీనరూపున
ధరణి కరిగె-నీ దినమున
(2)    ||రారే||
కల్లగాదిది కలయు గాదిది
గొల్ల బోయుల దర్శనం
తెల్లగానదే తేజరిల్లెడి
తార గాంచరే త్వరగ రారే
(2)    ||రారే||
బాలు-డడుగో వేల సూర్యుల
బోలు సద్గుణ శీలుడు
బాల బాలిక బాలవృద్ధుల
నేల గల్గిన నాథుడు
(2)    ||రారే||
యూదవంశము నుద్ధరింప
దావీదుపురమున నుద్భవించె
సదమలంబగు మదిని గొల్చిన
సర్వ జనులకు సార్వభౌముడు
(2)    ||రారే||

Video