రారే మన యేసు స్వామిని
Raarae Mana Yaesu Svaamini
UncategorizedAdded on 9/13/2017
Lyrics
జూతము కోర్కె – లూర ప్రియులారా పేర్మిని గూరిమి భక్తుల జేరువ విందట భూరిద యామృత సారము లొలికెడు చారు కటాక్ష వి – శాలేక్షనుడట నారకులగు నర – నారీ జనులకు దారక మొసగను దానే పిలుచునట దారుణ పాప మ-హారణ్యమునకు గారు చిచ్చు గతి గన్పడువాడట ఘోర దరిద్రత గూల్చెడి వాడట సారంబగు తన సభకు మకుటమాట ||రారే|| పతిత పావనమౌ వేల్పట అనాది దేవ సుతుడై – ఇల జేరినాడట సతతము కడు దురి – తతమోయుతమగు ప్రతి దేశమునకు – హిత భాస్కరుడట అతులిత మోక్షో – న్నత గుణగణుడట కుతలంబున స-ద్గతి రహితంబగు పతితుల గావను – మృతుడైనాడట అతి పుణ్య తను – క్షత శోణితమును వ్రతముగ సిలువను నతఁడొసంగెనట మృతిని జయించుచు బ్రతికి లేచెనట మతి నమ్మిన మన గతి యితడేనట ||రారే|| తుదలేని మహిమ వాడట తను గొల్చు సాధు – హృదయుల సొమ్ము మూటట చెదరిన గొర్రెల – వెదక వచ్చెనట చిదురుపలగు జన హృదయములన్నిట బదిలముగా నె-మ్మది నిడువాడట నదితట మఠ జన వదనముల స మ్మద శుభవార్తను – బలికినవాడట సదయత సంధుల – కక్షుల నిడెనట వెదకి బధిరులకు – వీనులొసగె నట సదమల మోక్ష ప్రభుడగు విభుడట యిదిగో మనకిత డేలినవాడట ||రారే||