రాత్రి నేడు రక్షకుండు
Raathri Naedu Rakshakumdu
UncategorizedAdded on 12/31/2016
Lyrics
నేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను లోక నాథుడై మరియకవతరించెను ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి|| బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము ఈ నాడే మనకు పండగ రారండి ఆడి పాడగ (3) ||రాత్రి|| ఆకశాన తార ఒకటి బయలుదేరెను తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను చిన్నారి యేసు బాబును కళ్లారా చూసి మురిసెను (3) ||రాత్రి|| పొలములోని గొల్లవారి కనుల ముందర గాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా మేరమ్మ జోల పాడగా జగాలు పరవశించెగా (3) ||రాత్రి|| లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి||