రావయ్య యేసునాథా
Raavayya Yaesunaathhaa
UncategorizedAdded on 10/5/2016
Lyrics
నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను ||రావయ్య|| నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి మా గండంబులన్నియు ఖండించుటకు ||రావయ్య|| మేర లేని పాపము మాకు భారమైన మోపు నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు ||రావయ్య|| పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను మా పాపంబులన్నియు పారద్రోలుటకు ||రావయ్య|| అందమైన నీదు పరమానంద పురమందు మేమందరము జేరి యానందించుటకు ||రావయ్య||