రావయ్యా యేసయ్యా
Raavayyaa Yaesayyaa
Lyricistదియ్యా ప్రసాద రావు
UncategorizedAdded on 8/21/2017
Lyrics
రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని… రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని కన్నులార నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2) ||రావయ్యా|| యదార్థ హృదయముతో నడచుకొందును ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను భక్తిహీనుల క్రియలు నాకంటనీయను మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును (2) ||రావయ్యా|| దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను నా పొరుగు వారిని దూషింపను అహంకారము గర్వము నంటనీయను నమ్మకస్థునిగా నే నడచుకొందును (2) ||రావయ్యా|| నిర్దోష మార్గముల నడచుకొందును మోసము నా ఇంట నిలువనీయను అబద్ధికులెవ్వరిని ఆదరింపను భక్తిహీనుల మార్గము నే త్రొక్కను (2) ||రావయ్యా||