రక్షకుడు వచ్చినాడు

Rakshakudu Vachchinaadu

Lyricistడేవిడ్సన్ గాజులవర్తి
UncategorizedAdded on 11/29/2022

Lyrics

రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా
నిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా
పాపమే లేనోడమ్మా పాపుల రక్షకుడమ్మా
ప్రాణమియ్య వెనుకాడని ప్రేమామయుడోయమ్మా
మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా
జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా
ప్రవక్తల ప్రవచనాలు నేరవేర్చాడమ్మా
మోడుబారిన బ్రతుకులలో దావీదు చిగురమ్మా
బాలుడై వచ్చాడమ్మా భారమే మోసాడమ్మా
విడుదలనే ఇచ్చిన దేవుని గొర్రెపిల్లమ్మా
||మన కోసం||
వినరే ప్రేమామయుని చరితం వినరే జనులారా
నమ్మితే చాలు మోక్షమునిచ్చును నమ్ము మనసారా
వెల తానే చెల్లించి తన వారసులుగ ఎంచి
నిత్యం తనతో ఉండే భాగ్యమునిచ్చాడమ్మా
||మన కోసం||

Video