రక్షకుండుదయించినాడట

Rakshakumdudayimchinaadata

Lyricistమోచర్ల రాఘవయ్య
UncategorizedAdded on 12/20/2015

Lyrics

రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార
తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము
||రక్షకుండు||
దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు
దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు
||రక్షకుండు||
గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత
తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త
||రక్షకుండు||
వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు
కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు
||రక్షకుండు||
పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి
శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె
||రక్షకుండు||
అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు
అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు
||రక్షకుండు||

Video