రక్షింపబడిన నీవు
Rakshimpabadina Neevu
Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 12/28/2017
Lyrics
రక్షింపబడిన నీవు – లోకాశలపైనే నీదు గురి నిలిపి పయనిస్తున్నావా రక్షకుని ఎరిగిన నీవు – తానెవరో తెలియదు నాకు అన్నట్టు జీవిస్తున్నావా యేసే లేని నీ బ్రతుకులో వెలుగే లేదని తెలుసుకో యేసే లేని జీవితానికి విలువే లేదని తెలుసుకో (2) ||రక్షింపబడిన|| మంటితోనే నిను చేసినా కంటి పాపగా కాపాడెనే మాటి మాటికి పడిపోయినా శాశ్వత ప్రేమతో ప్రేమించెనే ఆ ప్రేమను కాదని – అవసరమే లేదని ఈ లోకం నాదని – ప్రభు మార్గం విడచితివా యేసే లేనిదే – పరలోకానికి ప్రవేశం లేదనే – పరమార్ధం మరచితివా ||యేసే|| యేసులోనే నీ రక్షణ యేసులోనే నిరీక్షణ యేసులోనే క్షమాపణ చేసుకో మరి ప్రక్షాళన ఎంతో ప్రేమను – నీపై చూపించెను తన ప్రాణము సహితము – నీకై అర్పించెనుగా ఇప్పటికైననూ – మార్చుకో మనస్సునూ ప్రభువును చేరగా – వేగిరమే పరుగిడిరా ||యేసే||