రమ్మనుచున్నాడు

Rammanuchunnaadu

UncategorizedAdded on 11/5/2013

Lyrics

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి
రమ్మనుచున్నాడు
ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని
గ్రహించి నీవు యేసుని చూచిన
హద్దు లేని ఇంపు పొందెదవు
||రమ్మను||
కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్
కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ
కనికరించి నిన్ను కాపాడును
||రమ్మను||
సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును
ఆయన నీ వెలుగు రక్షణనై యుండును
ఆలసింపక త్వరపడి రమ్ము
||రమ్మను||
సకల వ్యాధులను స్వస్థత పరచుటకు
శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో
అందరికి తన కృపలనిచ్చున్
||రమ్మను||

Video

Rammanuchunnaadu Lyrics | Shining Christians