రండి సువార్త సునాదముతో
Rmdi Suvaartha Sunaadamutho
UncategorizedAdded on 7/16/2016
Lyrics
రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం యేసే పతీత పావన నామం భాసుర క్రైస్తవ శుభ నామం ||రండి|| యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం ||రండి|| యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్ధన సహకారం ||రండి|| యేసే సంఘములో మన కాంతి యేసే హృదయములో ఘన శాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి పసిపాపల దీవెన మూర్తి ||రండి|| యేసే జీవన ముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగ నమ్మిన జన స్తోత్రం ||రండి||