రుచి చూచి ఎరిగితిని
Ruchi Choochi Erigithini
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 6/29/2015
Lyrics
రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ || రుచి చూచి|| మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు || రుచి చూచి|| కృతజ్ఞతా చెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను || రుచి చూచి|| ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని || రుచి చూచి||