సమీపించరాని తేజస్సులో నీవు
Sameepimcharaani Thaejassulo Neevu
UncategorizedAdded on 6/18/2016
Lyrics
సమీపించరాని తేజస్సులో నీవు వసియించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింప తరమా యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) ||సమీపించరాని|| ధరయందు నేనుండ చెరయందు పడియుండ కరమందు దాచితివే నన్నే పరమున చేర్చితివే ఖలునకు కరుణను నొసగితివి (2) ||యేసయ్యా|| మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి నా స్థితి మార్చినది నన్నే శ్రుతిగా చేసినది తులువకు విలువను ఇచ్చినది (2) ||యేసయ్యా||